నేను ఒంటరిని!
హిందీ మూలం : సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా...
అనువాదం: రాధా కృష్ణ మిరియాల...
నేను ఒంటరిని!
వేచి చూస్తూ ఉన్నాను ,వస్తూ ఉన్న
నా రోజులోని ఈ సాయంత్ర వేళను..
సగం నెరిసిన నా వెంట్రుకలు,
పాలిపోయిన నా చెక్కిళ్ళు,
క్రమ క్రమంగా తగ్గిపోతూ
ఉంది నా కదలిక ,
దూరమైపోతూ ఉంది నా చుట్టూ ఉన్న ఈ సందడి
దూరమైపోతూ ఉంది నా చుట్టూ ఉన్న ఈ సందడి
తెలుసు నాకు , ఆ నదీ ప్రవాహాలు,
ఏ వైతే నేను దాటాల్సి ఉందో,
దాటేశాను నేను, ఇవన్నీ చూసి
నవ్వుకున్నాను,
ఏ నావ లేదు ఇపుడు నా వద్ద......
ఏ నావ లేదు ఇపుడు నా వద్ద......